Tuesday, February 15, 2011

గీ దేవులాడుడు ఏంది బై

నేను గత నెల రోజులుగా ఆఫీసు పనికి పంగనామాలు పెట్టి (నిజానికి ఏం పని లేదనుకోండి) ఏదైనా కోర్సు నేర్చుకుందామనుకున్నా కానీ నాకు ఇంతవరకు ఓ క్లారిటీ అనేది లేదు. ఎక్కడ నుండి మొదలెట్టాలి అని. ఇది ఎప్పుడు మొదలైంది అంటే నా మిత్రుడు LG లో జాబు కొట్టినప్పటి నుండి. వాడు SPRINGS మరియు HIBERNATE పైన రాక్షస ప్రయత్నాలు(చాలా ఉన్నాయి) అన్ని చేసి చివరికి జాబు సంపాదించాడు. నాకు మొదటి నుండి WEB APPS  పైన పని చేయాలి అని ఉంది.  కానీ సమయం అనుకూలించలేదు. కావున వాటిని నేర్చుకోవడం అటకెక్కించాను. ఒక మంచి రోజు ముహూర్తం చూసి చదవడం మొదలెట్టా. సాయంత్రం మాత్రమే చదవడానికి సమయం దొరికేది. పుస్తకాలూ పట్టి చాలా నెలలు గడిచిన నేపద్యంలో అదేంటో కానీ పుస్తకం పట్టినప్పుడు వచ్చే నిద్రని ఆపాలి అంటే జేజమ్మలు దిగి రావాల్సి వచ్చేది. అసలే వర్షా కాలం చదువులు నావి దీంతో నా కోరిక గొంతెమ్మ కోరిక ఐంది .  ఏదోలా  ౩ రోజులు మొరాయిస్తూ చదివా. ఇంతలో మల్లి ఆఫీసు లో పని ఎక్కువైంది. దీని వాళ్ళ ఇంటికి రాగానే నేను HIBERNATE MODE లోకి వెళ్ళాల్సి వచ్చేది.


కాస్త తీరిక దొరకగానే నాకు ఈ సారి ఎందుకో ANDROID APPS చేయాలి అనే కోరిక కలిగింది. ఈ సారి ఓ అడుగు ముందుకేసి అన్ని INSTALL చేసుకొని మరి చదవడం ఆరంభించాను. కానీ ఇది కూడా మూన్నాళ్ళ (సారీ మూడు రోజుల) ముచ్చటే ఐంది.


కొద్ది రోజులు తరువాత నా గురి MULTITHREADING, SOA ఫై పడింది. చిట్ట చివరికి ఇప్పుడు నాకిష్టమైన WEB APPS technologies ఐన ADF నేర్చుకుంటున్నాను. ఇప్పటికైతే సదువు సుతారంగానే సాగుతుంది. సూద్దాం ఇక ముందు కూడా ఇలానే సాగుద్దో లేక సట్టబండలవుద్దో.


విషయమేంటి అంటే నేను ముందు మొదలుపెట్టినవి ఏవి కూడా నాకు పనికొచ్చేవి కావు. అందుకని వాటి మీద అలుసుతో వదిలేసా. నేనిప్పుడు చదువుతున్న ADF ఫై నేను పని చేయాల్సి వస్తుంది మరియు ఇది (SPRINGS & HIBERNATE & STRUTS) కి దగ్గర పోలికలతో రూపొందించబడింది. సో ఇంకా దీనికి కమిట్ అయ్యాను.


ఈ పోస్ట్ ఎవరికీ ఉపయోగపడదు అని తెలుసు కానీ నాకు దీన్ని తలచుకుంటే నా ఈ మూడు రాత్రుల అనుభవాలు మీకు చెప్పాలి అని అనిపించి రాసాను.

Thursday, February 3, 2011

పునఃప్రారంభం

ఔను పునఃప్రారంభం!! ఇంతకి మునుపు నేను వేరే బ్లాగ్లో టపాలు వ్రాస్తూ ఉండేవాడిని. సంవత్సరం పాటు ఎలాంటి టపాలు వ్రాయలేదు. ఈ సంవత్సరం లో నా పాత బ్లాగ్ కి అనుసందానం చేయబడిన ఈ ఉత్తరం ని మర్చిపోయాను. విశేషం ఏంటి అంటే నా మునపటి బ్లాగ్ కి ఎలాంటి రికవరీ మెయిల్ ID కూడా అనుసందానం చేయబడి లేదు. అందు చేత నేను నా పాత బ్లాగ్ లో తిరిగి టపాలు వ్రాద్దామని చేసిన విశ్వప్రయత్నాలు గంగపాలు అయ్యాయి. ఇప్పటి నుండైన తరుచుగా టపాలు వ్రాసి కనీసం ఈ బ్లాగ్ ని ఐన దీని చావుకి వదిలేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. 

ఏడ్చినట్టుంది. ఇంత సుబ్బరంగా రాస్తే...ఎవరికీ నచ్చదు అని నా అభిప్రాయం. పోనీలే ఏదో ఒకటి. Context  ని బట్టి పదాలు మారుతాయి. సెలవు మరి.